తెలియని ప్లాట్ఫాం మీద అధికులమనరాదు
డల్లుగుండుటెల్ల నల్లు (null) కాదు
జిప్పు చెసిన ఫైలు మెమరీ తగ్గదా?
సాఫ్ట్వేరు బైట్సు, వినరా గేట్సు
నా ఈ కళా ఖండానికి,ప్రజా కవి వేమన ఓ 500 ఏళ్ల క్రితమే పేరడీ రాసాడని ఈ క్రింది పద్యం చదివితే ఇట్టే తెలిసిపోతుంది. అఫ్కోర్స్, మరీ కాపీ-పేస్ట్ కాకుండా "ఆట వెలది" లో రాసాడనుకొండి.
అనువుగాని చోట అధికులమనరాదు
కొంచెముండుటెల్ల కొదువ కాదు
కొండ యద్దమందు కొంచెమై వుండదా
విశ్వదాభి రామ వినుర వేమ
Subscribe to:
Post Comments (Atom)
11 comments:
అదిరింది సారూ మీరు పుట్టకముందు పుట్టేసి మీరు రాద్దామనుకున్నది ఆయన రాసేసాడు కదా.నేను కనిపెట్టేసా.
బాగుందండి. నవ్వులని అక్షరాలలో చూపలేము కదా!
పద్యము బావుంది. వేమనగారి పేరడీ కూదా చాలా బాగుందండి.
అనుకరణ ప్రశంశ అంటారు కదా. అందుకోండి వేమన గారి అభినందనలు.
లలిత.
మీ పేరడీ బావుంది.
మీరు పీకిన ఈ పేరడీ పీకుడుకి నాలోని వేమన బయటకొచ్చాడు.
నేను ఎన్నాళ్ళ నుంచో రాద్దామనుకున్న పేరడీలకు శ్రీకారం చుట్టా.
-- పేరడీల విహారి
(కాప్షన్ -- శతకాలు ఇస్పెషల్)
చాలా బాగుందండి కవిత
హ హ్హ హ్హా...
హాయ్ సోపేటి, నిజంగా మీ ప్రతి టపా కూడా సూపర్.మీలోని హాస్యప్రియత్వం నాకు చాలా నచ్చింది. BTW నేను మీ RECW లో HYD మేట్ సుదర్శన్ అన్నయ్యని. మీ గురించి మా వాడు అబ్బో బాగ చెప్పాడు. మీ నుంచి ఇంకా ఇంకా మంచి మంచి టపాలు ఆశిస్తున్నాను.
మీరూ ఆర్యీసీడబ్యూ నా? అనుకున్నా ఆ హాస్యప్రియత్వమూ ఆ తెలివితేటలూ చూసి. సంతోషం.
వీలు చూసుకుని kottapali at yahoo dot com ఒక జాబు రాయించండి.
భలే ఐడియా. ఆ ఆరీసీ తలకాయనే మరికాస్తగోకితే ఛందస్సుతో సహా అచ్చమైన పద్యం రాలి పడేదికదా.
@రాధిక కరకట్టు గా చెప్పారు మేడం. మీరు వీజీగా ఓ డిటెక్టీవ్ ఏజెన్సీ ఓపెన్ చెయ్యొచ్చు..
@లలిత సంతోషమండి. మీవి,వేమన గారి, మరియు యువర్స్ లవింగ్లీ వారి అభినందనలు కూడా అందుకున్నాను.
@విహారి మరింక ఆలశ్యం ఎందులకు.పేరడీ రెక్కలు కట్టుకుని బ్లాగాకాశం లో యధేచ్చగా విహరించండి.
@రావు గారూ,రాజు గారూ ధన్యవాదాలు
@శ్రీనివాస్ గారు,మీరు మా సుదర్శన్ గాడి పెద్దనయ్య ఐతే నా మెమరీ హరీమనకపొతే ఓరుగల్లు లొ మీ వివాహానికి నేను హాజరయ్యాను
@కొత్త పాళీ మీ యాహూ టపా చూసుకొనగలరు
@రానారె బాసు,నా తలకాయని ఇంకా గోకితే గోళ్ళు అరిగిపొతాయ్ తప్ప,నాకు ఛందోబద్ధంగా రాయటం తెల్సు అని చెప్తే అది అబద్ధమే అవుతుంది.ఛందస్సు అంటే మన బుర్ర కి భరనభభరవ తప్ప ఏమీ గుర్తుకురాదు.ఈ విషయం లో నన్ను మన్నించగలరు.
ఆడియా ఆదిరింది గురువు గారు ...
Post a Comment