Thursday, May 03, 2007

ఎద్యం...

ఎదలోంచి వచ్చిన పద్యాన్ని నేను (మీరు కాదనరు అనే నమ్మకంతో) ఎద్యం అంటున్నా...
ఎద్దేవా చెయ్యకుండా ఈ ఎద్యం చదువుకోండి మరి ...

అటు నించి తను
ఇటు నించి నేను
*
యుగ యుగాల విరహ వేదన
మరు క్షణంలో కరిగిపోతుందనే భావన
* *
అందుకున్నా ఆలింగనం
అందులోని ఆ కమ్మదనం
* * *
అంతలో.
ఆ కౌగిలింతలో..
ఆ పులకింతలో...
* * * *
కచ్చితమైన ధోరణి లో నా రాణి వాణి
"సచ్చినోడా!వదులు,ఊపిరాడక చస్తున్నా!!" అని

5 comments:

కొత్త పాళీ said...

మనసులోంచి వస్తే ఏమవుతుంది??
అవునూ, ఈ ఎ(ప)ద్యం వచ్చింది ఎదలోనించేనా? Are you sure?? :-))

Venky said...

Andhra meals thinna body kadaa!!! mari big(i) kougili alaane vuntundi !!!!! hahhaha...nice padyam..no no...edyam.. baavaa!!!

World through Vijays Eyes said...

Edyam baagundira.. annattu telugulo ela raayaalo naakkuda chebithe.. memu kooda ee telugu sahityanni naludishala paakenduku krushi chesthaam..!!

రవి వైజాసత్య said...

లేఖిని ( http://lekhini.org )తో తెలుగు రాయటం చాలా సులభం. ఇంకా తెలుగు బ్లాగు గురించి ప్రశ్నలుంటే గూగూల్ తెలుగు బ్లాగు ( http://groups.google.com/group/telugublog ) బృందాన్ని చూడండి

Sri Ram Nandiraju said...

edyam enti ra babu....it is funny and innovative
yeda lonchi vastey yeadyam annavu...mari padyam endu lonchi vachinattu??